Nov 5, 2008

గుణ

తారాగణం:కమల్‌హాసన్, రోషిణి
గాత్రం:బాలు,శైలజ
సంగీతం:ఇళయరాజా
దర్శకత్వం:సంతానభారతి
విడుదల:1991




పల్లవి:

ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఊహలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలొ
కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఊహలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలొ
ఒహొ కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే

చరణం1:

గుండెల్లో గాయమేదో చల్లంగ మానిపొయె
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైనగాని నా మేనికేమిగాదు
పువ్వు సొకి నీ సోకు కందేనే
వెలికిరాని వెర్రిప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది
నాదు శోకమొపలేక నీ గుండె బాధ పాడితే తాళనన్నది
మనుషులెరుగలెరు మాములు ప్రేమ కాదు
అగ్ని కంటే స్వచ్చమైనది

మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
ఉమాదేవి గా శివుని అర్ధభాగమై నాలోన నిలువుమా
శుభ లాలి లాలి జో
లాలి లాలి జో
ఉమాదేవి లాలి లాలి జో
లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
నా హృదయమా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: