Nov 7, 2008

నాటకాల రాయుడు

తారాగణం:కైకాల సత్యనారాయణ,కాంచన,నాగభుషణం,నాగయ్య
సాహిత్యం:ఆత్రేయ
గాత్రం:సుశీల
సంగీతం:జి.కె.వెంకటేష్
నిర్మాత:శ్రీహరిరావు
దర్శకత్వం:ఏ.సంజీవి
విడుదల:1969

పల్లవి:

నీలాల కన్నుల్లో మెలమెల్లగ నిదుర రావమ్మ రావే నిండార రావే
నెలవంక చలువల్లు వెదజల్లగ నిదుర రావమ్మ రావే నెమ్మదిగ రావే
నీలాల కన్నుల్లో మెలమెల్లగ నిదుర రావమ్మ రావే నిండార రావే

చరణం:1

ఓ ఓ ఓ చిరుగాలి బాల పాడింది జోల పాడింది జోల
చిగురాకు మనసు కనుపాపలందు ఎద దోచెనమ్మ ఏవేవో కలలు
కలలన్ని కలలెన్నో విరబూయగ
నిదుర రావమ్మ రావే నెమ్మదిగ రావే
నీలాల కన్నుల్లో మెలమెల్లగ నిదుర రావమ్మ రావే నిండార రావే

చరణం:2

ఓ ఓ ఓ నిదురమ్మ ఒడిలో ఒరిగింది రేయి ఊగింది లాలి
గగనాన్ని చూసి ఒక కన్నుదోయి వినిపించమంది ఎన్నెన్నో కధలు
కధ చెప్పి మురిపించి మరిపించగ
నిదుర రావమ్మ రావే నెమ్మదిగ రావే
నీలాల కన్నుల్లో మెలమెల్లగ నిదుర రావమ్మ రావే నిండార రావే
నెలవంక చలువల్లు వెదజల్లగ నిదుర రావమ్మ రావే నెమ్మదిగ రావే

| |

No comments: