గాత్రం:పి.సుశీల,ఎస్.జానకి
సాహిత్యం:దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం:సత్యం
విడుదల:1979

పల్లవి:
ఆ ఆ ఆ అ ఆ ఆ అ అ అ అ అ
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ నీపాద పీఠం కర్పూరదీపం
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ నీపాద పీఠం కర్పూరదీపం
ఇదే సుమా నా కుంకుమతిలకం
ఇదే సుమా నా మంగళసూత్రం
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ పాద పీఠం కర్పూరదీపం
చరణం1:
ఇంటిలోన నా పాప రూపు నాగోరంతదీపం
కంటికెదురుగా కనపడువేళల కొండంతదీపం
నా మనస్సులో వెలిగే దీపం
నా మనుగడ నడిపే దీపం
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ నీపాద పీఠం కర్పూరదీపం
చరణం2:
ఆకాశాన ఆ మణి దీపాలే ముత్తైదువులుంచారు
ఈకోనేట ఈ చిరుదివ్వెల చూసి చుక్కలనుకుంటారు
ఏవైనా ఏదైనా కోవెలలో కొలువై వుండే దేవికి పట్టే హారతులే
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ నీపాద పీఠం కర్పూరదీపం
చేరనీ నీపాద పీఠం నాప్రాణదీపం
చరణం3:
నోచిన నోములు పండెనని ఈ ఆనంద దీపం
నా దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశాదీపం
నా నోచిన నోములు పండెనని ఈ ఆనంద దీపం
నా దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశాదీపం
ఎటనైనా ఎపుడైనా నే పలికే కళ్యాణదీపం
నే వలచే నాప్రాణదీపం
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ నీపాద పీఠం కర్పూరదీపం
చేరనీ నీపాద పీఠం నాప్రాణదీపం
|
No comments:
Post a Comment