Nov 13, 2008

బృందావనం

గాత్రం:బాలు,జానకి



పల్లవి:

మధురమే సుధాగానం మనకిదే మరోప్రాణం
మదిలో మొహన గీతం మెదిలే తొలి సంగీతం
మధురమే సుధాగానం మనకిదే మరోప్రాణం
మదిలో మొహన గీతం మెదిలే తొలి సంగీతం

చరణం1:

చరణాలు ఎన్నివున్నా పల్లవొకటే కదా
కిరణాలు ఎన్ని వున్నా వెలుగొక్కటేకదా
శతకోటి భావాలను పలుకు ఎద మారునా
సరిగమలు మారుతున్న మధురిమలు మారునా
మధురమే సుధాగానం మనకిదే మరోప్రాణం
మదిలో మొహన గీతం మెదిలే తొలి సంగీతం

చరణం2:

వేవేల తారలున్నా నింగి ఒకటే కదా
ఎన్నెన్ని దారులున్నా గమ్యమొకటే కదా
ఎనలేని రాగాలకు నాదమొకటే కదా
అనుభూతులెన్ని వున్నా హృదయమొకటే కదా

మధురమే సుధాగానం మనకిదే మరోప్రాణం
మదిలో మొహన గీతం మెదిలే తొలి సంగీతం
మధురమే సుధాగానం మనకిదే మరోప్రాణం
మదిలో మొహన గీతం మెదిలే తొలి సంగీతం
మదిలో మొహన గీతం మెదిలే తొలి సంగీతం

||

2 comments:

ramya said...

విహారి గారు, ఇప్పుడు ఇలాంటి టెంప్లేట్ 3కాలమ్ లో కూడా ఉంది ప్రయత్నించి చూడండి సూటవుతుందేమొ!

ramya said...

labels ni gadget loki velli tirigi add ceyoccu,
migatavi links html save chesi malli pettagalaremo try cheste.