Nov 17, 2008

భాగ్యలక్ష్మి

తారాగణం:మురళీమోహన్,సరిత
గాత్రం:సుశీల
సంగీతం:ఎం.ఎస్.విశ్వనాథన్



పల్లవి:

కృష్ణశాస్రి కవితలా కృష్ణవేణి పొంగులా
కృష్ణశాస్రి కవితలా కృష్ణవేణి పొంగులా
పాలలా తేనెలా దేశభాషలందు లెస్సగా
పాలలా తేనెలా దేశభాషలందు లెస్సగా
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు
కృష్ణశాస్రి కవితలా కృష్ణవేణి పొంగులా

చరణం1:

కృష్ణదేవరాయుల కీర్తివెలుగు తెలుగు
తెలుగు ఊ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కృష్ణదేవరాయుల కీర్తివెలుగు తెలుగు
కాకతీయ రాజుల పౌరుషాగ్ని తెలుగు
కాకతీయ రాజుల పౌరుషాగ్ని తెలుగు
కూచిపూడి నర్తన త్యాగరాజ కీర్తన
కూచిపూడి నర్తన త్యాగరాజ కీర్తన
అడుగడుగు అణువణువు అచ్చతెలుగు జిలుగు తెలుగు సంస్కృతికే ముందడుగు
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు
కృష్ణశాస్రి కవితలా కృష్ణవేణి పొంగులా

చరణం2:

పోతులూరి వీరబ్రహ్మ సూక్తులన్ని తెలుగు
పొట్టిశ్రీరాముల త్యాగనిరతి తెలుగు
పొట్టిశ్రీరాముల త్యాగనిరతి తెలుగు
కందుకూరి సంస్కారం చిలకమర్తి ప్రహసనం
కందుకూరి సంస్కారం చిలకమర్తి ప్రహసనం
నేటితరం ముందుతరం అనుసరించు బాట తెలుగు
జాతికిదే కానుక

తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు
కృష్ణశాస్రి కవితలా కృష్ణవేణి పొంగులా
పాలలా తేనెలా దేశభాషలందు లెస్సగా
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు
కృష్ణశాస్రి కవితలా కృష్ణవేణి పొంగులా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: