సంగీతం:ఏ.ఆర్.రహమాన్
దర్శకత్వం: మణిరత్నం
విడుదల:1997

పల్లవి:
శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో నీ మది తెలపగ రావా
అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా
అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా
నవమధన నవమధన కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వముల వాహనుడా విడవకు మురిసిన బాట
అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె
గిచ్చే మోజు మోహనమే నీదా
చరణం1:
మదనమోహిని చూపులోన మాండురాగమేలా
మదనమోహిని చూపులోన మాండురాగమేలా
పడుచువాడినే కన్న వీక్షణ పంచదార కాదా
కల ఇల మేఘమాసం క్షణానికో తోడి రాగం
కల ఇల మేఘమాసం క్షణానికో తోడి రాగం
చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఖల కటిని గిల్లే
శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో నీ మది తెలపగ రావా
అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా
చరణం2:
నెయ్యం వియ్యం ఏదేమైనా తనువు నిలవదేలా
నెయ్యం వియ్యం ఏదేమైనా తనువు నిలవదేలా
నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేల
ఒకే ఒక చైత్రవేళ పురేవిడి పూతలాయే
ఒకే ఒక చైత్రవేళ పురేవిడి పూతలాయే
అమృతం కురిసిన రాతిరి ఓ జాబిలి హృదయం జత చేరే
నవమధన నవమధన కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వముల వాహనుడా విడవకు మురిసిన బాట
అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా
ఆ ఆ ఆ ఆ ఆ నీదా
ఆ ఆ ఆ ఆ ఆ నీదా
ఆ ఆ ఆ ఆ ఆ నీదా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment