May 23, 2011

కళ్యాణి

తారాగణం: మురళీమోహన్, జయసుధ
గాత్రం: బాలు
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
సంగీతం: రమేష్ నాయుడు
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: అన్నపూర్ణ అక్కినేని
సంస్థ: అన్నపూర్ణ పిక్చర్స్
విడుదల: 1979

పల్లవి:

లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను

మధుర భారతి పద సన్నిధిలో
మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను
ఒదిగే తొలి పువ్వును నేను

చరణం1:

ఏ ఫలమాశించి మత్తకోకిల ఎలుగెత్తి పాడును
ఏ ఫలమాశించి మత్తకోకిల ఎలుగెత్తి పాడును
ఏ వెల ఆశించి పూచే పువ్వు తావిని విరజిమ్మును

అవధి లేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్ధం
లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను

చరణం2:

ఏ సిరి కోరి పోతన్న భాగవత సుధలు చిలికించెను

ఏ నిధి కోరి త్యాగయ్య రాగ జలనిధులు పొంగించెను

రమణీయ కళావిష్కృతికి
రమణీయ కళావిష్కృతికి రసానందమే పరమార్ధం

లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను
మధుర భారతి పద సన్నిధిలో
మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను
ఒదిగే తొలి పువ్వును నేను
లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: