Oct 13, 2007

నర్తనశాల(1963)

గాత్రం: సుశీల
సాహిత్యం: సముద్రాల






పల్లవి:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సఖియా వివరించవే
సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కధ
సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కధ
సఖియా వివరించవే

చరణం1:

నిన్ను చూచి కన్నులు చెదరి
కన్నె మనసు కానుక చేసి
నిన్ను చూచి కన్నులు చెదరి
కన్నె మనసు కానుక చేసి
మరువలేక మనసు రాక
విరహాన చెలికాన వేగేనని
సఖియా వివరించవే

చరణం2:

మల్లెపూల మనసు దోచి
పిల్లగాలి వీచే వేళ
ఆ మల్లెపూల మనసు దోచి
పిల్లగాలి వీచే వేళ
కలువరేని వెలుగులోన
సరసాన సరదాలు తీరేనని

సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కధ
సఖియా వివరించవే ఏ ఏ ఏ



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: