Oct 2, 2007

మాతృదేవత

తారాగణం:రామారావు,సావిత్రి,చంద్రకళ
సంగీతం:కెవి.మహదేవన్
విడుదల: 1969

పల్లవి:

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరా ననెన్నడు మరువకురా కృష్ణా
మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరా ననెన్నడు మరువకురా కృష్ణా
మనసే కోవెలగా అహా ఆ అహ ఆ

చరణం1:

ఈ అనురాగం ఈ అనుబంధం మన ఇరువురి ఆనందం
ఈ అనురాగం ఈ అనుబంధం మన ఇరువురి ఆనందం
కలకాలం మదినిండాలి కలలన్ని పండాలి
కలకాలం మదినిండాలి కలలన్ని పండాలి
మన కలలన్ని పండాలి

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా

చరణం2:

ఎన్నో జన్మల పుణ్యముగా నిన్నే తోడుగ పొందాను
ఎన్నో జన్మల పుణ్యముగా నిన్నే తోడుగ పొందాను
ప్రతి రేయి పున్నమిగా బ్రతుకు తీయగా గడిపేను
ప్రతి రేయి పున్నమిగా బ్రతుకు తీయగా గడిపేను

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా

చరణం3:

నీచూపులలో చూపులతో నీ ఆశలలో ఆశలతో
నీచూపులలో చూపులతో నీ ఆశలలో ఆశలతో
ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై ఒకరికి ఒకరై బ్రతకాలి
ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై ఒకరికి ఒకరై బ్రతకాలి

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరా ననెన్నడు మరువకురా కృష్ణా
మనసే కోవెలగా మమతలు మల్లెలుగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: