పల్లవి:
ఇన్ని రాశుల యునికి ఇంతి చలువపు రాశి
ఇన్ని రాశుల యునికి ఇంతి చలువపు రాశి
కన్నె నీరాశి కూటమి కలిగినరాశి
ఇంతి చలువపు రాశి
ఇన్ని రాశుల యునికి ఇంతి చలువపు రాశి
కన్నె నీరాశి కూటమి కలిగినరాశి
ఇంతి చలువపు రాశి
చరణం1:
కలికి బొమవిందుగల కాంతకును ధనురాశి
మెలయు మీనాక్షికిని మీనరాశి
ఓ.. కలికి బొమవిందుగల కాంతకును ధనురాశి
మెలయు ఉం.. మీనాక్షికిని మీనరాశి
ఉం.. కులుకు కుజకుంభముల కొమ్మకును కుంభరాశి
ఉం..వెలుగు హరిమధ్యపులో సిం హరాశి
ఇన్ని రాశుల యునికి ఇంతి చలువపు రాశి
కన్నె నీరాశి కూటమి కలిగినరాశి
ఇంతి చలువపు రాశి
చరణం2:
చిన్నిమకరాంతపుపై ఎదకుచేరెకు మకరరాశి
కన్నెప్రాయపుసఖికి కన్నెరాశి
చిన్నిమకరాంతపుపై ఎదకుచేరెకు మకరరాశి
కన్నెప్రాయపుసఖికి కన్నెరాశి
వన్నెమైపైడి తులతూగు వనితనకుం తులరాశి
వన్నెమైపైడి తులతూగు వనితనకుం తులరాశి
పిన్ననివాడి గోళ్ళసతికి వృశ్చికరాశి
ఇన్ని రాశుల యునికి ఇంతి చలువపు రాశి
చరణం3:
ఆముకొనినొరపుల మెరయునతివకు వృషభరాశి
జామిడి గుట్టుమాటల సతికి కర్కటకరాశి
ఓ...ఆముకొనినొరపుల మెరయునతివకు వృషభరాశి
జామిడి గుట్టుమాటల సతికి కర్కటకరాశి
కోమల చిగురుమోవి కోమలికి మేషరాశి
ప్రేమవేంకటపతి కలిసే ప్రియ మిధునరాశి
ప్రేమవేంకటపతి కలిసే ప్రియ మిధునరాశి
ఇన్ని రాశుల యునికి ఇంతి చలువపు రాశి
కన్నె నీరాశి కూటమి కలిగినరాశి
ఇంతి చలువపు రాశి
|
3 comments:
Nice post anDi
thank u sir.
చిన్న తప్పు ఉందండి lyric లో
" ఇంతి చలువపు రాశి " అని రాశరు. కాని అది " ఇంతి చెలువపు రాశి ". చెలువ అంటే చెలియా, సఖి అని అర్థం
Post a Comment