Oct 12, 2007

భలేరాముడు

తారాగణం:నాగెశ్వరరావు,సావిత్రి
గాత్రం: ఘంటసాల,పి.లీల
సంగీతం:సాలూరి రాజేశ్వరరావు
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
విడుదల : 1956




పల్లవి:

ఒహో మేఘమాలా ఆ ఆ ఆ ఆ నీలాల మేఘమాల
ఒహో మేఘమాలా నీలాల మేఘమాల
చల్లగ రావేలా మెల్లగ రావేలా
చల్లగ రావేలా మెల్లగ రావేలా
వినీల మేఘమాలా వినీల మేఘమాలా
వినీల మేఘమాలా వినీల మేఘమాలా
నిదురపోయే రామ చిలుక
నిదురపోయే రామ చిలుక బెదిరి పోతుంది
కల చెదిరి పోతున్నది
చల్లగ రావేలా ..మెల్లగ రావేలా

చరణం1:

ప్రేమ సీమలలో చరించే బాటసారీ ఆగవోయి
ప్రేమ సీమలలో చరించే బాటసారీ ఆగవోయి
పరవశంతో ప్రేమ గీతం పాడబోకోయీ
పరవశంతో ప్రేమ గీతం పాడబోకోయీ
ఏ?
నిదుర పోయే రామ చిలుక
నిదుర పోయే రామ చిలుక బెదిరిపోతుంది
కల చెదిరి పోతున్నది
చల్లగ రావేలా ..మెల్లగ రావేలా

చరణం2:

ఒహో ఓ ఓ ఒహో ఓ ఓ
ఆశలన్ని తారకలుగా హారమొనరించీ
ఆశలన్ని తారకలుగా హారమొనరించీ
అలంకారమొనరించి మాయ చేసి మనసు దోచి
మాయ చేసి మనసు దోచి పారిపోతావా దొంగా పారిపోతావా
చల్లగ రావేలా ..మెల్లగ రావేలా
చల్లగ రావేలా ..మెల్లగ రావేలా

||

No comments: