గాత్రం:బాలు,సుశీల
పల్లవి:
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు
ననుగన్న నా వాళ్ళు ఆ ఆ నా కళ్ళ లోగిళ్ళు
ననుగన్న నా వాళ్ళు ఆ ఆ నా కళ్ళ లోగిళ్ళు
ఈ గాలి ఈ నేల
చరణం1:
చిన్నారి గొరవంక కూసేను ఆ వంక నా రాత తెలిసాక వచ్చేను నా వంక
చిన్నారి గొరవంక కూసేను ఆ వంక నా రాత తెలిసాక వచ్చేను నా వంక
ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక
ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక
ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను నింగి దాక
ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను నింగి దాక
ఎగసేను నింగి దాక
ఈ గాలి ఈ నేల ఈ వూరు సెలయేరు
ననుగన్న నా వాళ్ళు ఆ ఆ నా కళ్ళ లోగిళ్ళు
ఈ గాలి ఈ నేల
చరణం2:
ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను
ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను
ఈ రాళ్ళే జవరాలై ఇక నాట్యాలాడేను
ఈ రాళ్ళే జవరాలై ఇక నాట్యాలాడేను
కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై
తళుకుమన్న తార చిలుకు కాంతి చినుకులై
కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై
తళుకుమన్న తార చిలుకు కాంతి చినుకులై
గగన గళమునుంది అమర గానవహిని ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ
గగన గళమునుంది అమర గానవాహిని
జాలువారుతోంది ఇలా అమృతవర్షిణీ అమృతవర్షిణి అమృతవర్షిణి
ఈ స్వాతి వానలో నా ఆత్మ స్నానమాడే
నీ మురళిలొ నా హృదయమే స్వరములుగా మారే
అహాహా అహ ఆ ఆ
ఈ గాలి ఈ నేల ఈ వూరు సెలయేరు
ననుగన్న నా వాళ్ళు ఓ నా కళ్ళ లోగిళ్ళు
ఈ గాలి ఈ నేల
|
No comments:
Post a Comment