తారాగణం:కమల్ హాసన్,సరిత,మాధవి
సాహిత్యం:ఆత్రేయ
గాత్రం:సుశీల,కమల్ హాసన్
సంగీతం:ఎం.ఎస్.విశ్వనాథన్
దర్శకత్వం:బాలచందర్
పల్లవి:
ఏ తీగ పూవునొ
ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
అప్పిడన్న అర్ధం కాలేదా
ఏ తీగ పూవునొ
ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
చరణం1:
మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది
మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది
ఆహ అప్పుడియ, పెద్ద అర్దం అయినట్టు
బాషలేనిది బందమున్నది
మన ఇద్దరిని జత కూర్చినది
మన ఇద్దరిని జత కూర్చినది
ఏ తీగ పూవునొ
ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
చరణం2:
వయసే వయసును పలకరించినది
వలదన్నా అది నిలువకున్నది
ఏ నీ రొంబ అలహారిక్కే, ఆ రొంబ అంటే
ఎల్లలు యేవి వొల్లలన్నది
నీది నాదోక లొకం అన్నది
నీది నాదోక లొకం అన్నది
ఏ తీగ పూవునొ
ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
చరణం3:
తొలి చూపే నను నిలవేసినది మారుమాపై అది కలవరించినది
నల్ల పొన్ను అంటే నల్ల పిల్ల
మొదటి కలయికే ముడివేసినది
తుది దాక ఇధి నిలకడైనది
తుది దాక ఇధి నిలకడైనది
ఏ తీగ పూవునొ
ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment