Oct 14, 2007

ష్....గప్ చుప్

తారాగణం:వరుణ్ రాజ్,భానుప్రియ
గాత్రం:బాలు,చిత్ర
సంగీతం:రాజ్-కోటి
దర్శకత్వం:జంధ్యాల
విడుదల:1994

పల్లవి:

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చుసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా
అమ్మడి సిగ్గులే గుమ్మడి పువ్వులై
పిల్లడి పల్లవే పచ్చని వెల్లువై
సాగప గాపాప గగగారిసగ
సాగప గాపాప గగగారిసగ
కాటుక కల్లలో కన్నె వాకిల్లలో
తెలుగందాలే నన్ను తొంగి తొంగి చుసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా

చరణం1:

తిక్కనలో తీయదనం లిపిచక్కని నీ కన్నెతనం
పోతనలో రామరసం వడపోసిన నీ ప్రేమరసం
ప్రాయానికే వేదం నవపద్మావతి పాదం
ఓ రాగానికే అందం రసగీత గోవిందం
వంశధార ఒడిలో హర్షవల్లిక ఆ ఆ
సూర్యకాంత వీణ రాగదీపిక

సాగప గాపాప గగగారిసగ
సాగప గాపాప గగగారిసగ
కాటుక కల్లలో కన్నె వాకిల్లలో
తెలుగందాలే నన్ను తొంగి తొంగి చుసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా

చరణం2:

క్షేత్రయ్యలో జానతనం వరదయ్యెనులే వలపుతనం
అందని నీ ఆడతనం అమరావతిలో శిల్పదనం
ఏడుగ చీలిందిలే నది గౌతమి గోదావరి
ఆ ఏకం కావాలిలే ఏడుజన్మల గంధాలివి
కృష్ణవేణి జడలో శైలమల్లిక
శివుడి ఆలయాన భ్రమరదీపిక

సాగప గాపాప గగగారిసగ
సాగప గాపాప గగగారిసగ
కాటుక కల్లలో కన్నె వాకిల్లలో
తెలుగందాలే నన్ను తొంగి తొంగి చుసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: