Oct 14, 2007

శ్రీవెంకటేశ్వరమహత్యం

తారాగణం:రామారావు,సావిత్రి,ఎస్.వరలక్ష్మి,శాంతకుమారి
గాత్రం:ఘంటసాల
సంగీతం:పెండ్యాల నాగేశ్వరరావు
దర్శకత్వం:పి.పుల్లయ్య
సంస్థ:పద్మశ్రీ పిక్చర్స్
విడుదల:1960




పల్లవి:

శేషశైలావాస శ్రీవేంకటేశ
సయనించు మా అయ్య శ్రీచిద్విలాస
శేషశైలావాస శ్రీవేంకటేశ

చరణం1:

శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు
అలివేలు మంగకు అలుక రానీయకు
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు
అలివేలు మంగకు అలుక రానీయకు
ముద్దు సతులిద్దరిని ఇరువైపుల జేర్చి
ముద్దు సతులిద్దరిని ఇరువైపుల జేర్చి
మురిపించి లాలించి ముచ్చటల తేల్చి
శేషశైలావాస శ్రీవేంకటేశ

చరణం2:

పట్టుపానుపుపైన పవళించర స్వామి
పట్టుపానుపుపైన పవళించర స్వామి
భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ
చిరునగవులొలుకుచు నిదురించు నీ మోము
చిరునగవులొలుకుచు నిదురించు నీ మోము
కరువుతీరా కాంచి తరియింతుము మేము

శేషశైలావాస శ్రీవేంకటేశ
సయనించు మా అయ్య శ్రీచిద్విలాస
శేషశైలావాస శ్రీవేంకటేశ

1 comment:

బ్లాగేశ్వరుడు said...

శీర్షక పేరు సరి చేయండి.వేంకట వెంకట కాదు.