Oct 29, 2007

నర్తనశాల

గాత్రం: ఘంటసాల,సుశీల
సాహిత్యం: శ్రీశ్రీ



పల్లవి:

ఎవ్వరి కోసం ఈ మందహాసం
ఒకపరి వివరించవే
సొగసరి ఒకపరి వివరించవే
చెలిమి కోసం చెలి మందహాసం
ఏమని వివరింతును
గడుసరి ఏమని వివరింతును

చరణం1:

ఆ వలపులు చిలికె వగలాడి చూపు
పిలువక పిలిచి విరహాల రేపు
ఎదలో మెదలే చెలికాని రూపు
ఏవొ తెలియని భావాల రేపు
ఈ నయగారం ప్రేమ సరాగం
ఈ నయగారం ప్రేమ సరాగం
అందించు అందరాని సంబారాలే

ఎవ్వరి కోసం ఈ మందహాసం
ఒకపరి వివరించవే
సొగసరి ఒకపరి వివరించవే

చరణం2:

ఆ పరుగులు తీసే జవరాలి వయసు
మెరుపై మెరసి మరపించు మనసు
ఆ ప్రణయము చిందె సరసాల గంధం
ఇరువురి నొకటిగ పెనవేయు బంధం
ఈ వయ్యారం ఈ సింగారం
ఈ వయ్యారం ఈ సింగారం
చిందించు చిన్ని చిన్ని వన్నెలెన్నో

ఎవ్వరి కోసం ఈ మందహాసం
ఒకపరి వివరించవే
సొగసరి ఒకపరి వివరించవే
ఆ చెలిమి కోసం చెలి మందహాసం
ఏమని వివరింతును
గడుసరి ఏమని వివరింతును



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: