Oct 2, 2007

పెద్దరికం



పల్లవి:

ప్రియతమ ప్రియతమ తరగని పరువమా తరలిరా తరలిరా
కన్నెగోదారిలా కొంటె కావేరిలా నిండుకౌగిళ్ళలో చేరరావే
ప్రియతమ ప్రియతమ తరగని విరహమా కదలిరా ఆ కదలిరా
మాఘమాసానివై మల్లెపూమాలవై నిండు నాగుండెలో ఊయలూగా
ప్రియతమ ప్రియతమ తరగని పరువమా తరలిరా ఓ తరలిరా


చరణం1:

నీ ఆశలన్ని నా శ్వాసలైనా ఎంతమోహమో
ఓ నీ ఊసులన్ని నా బాసలైనా ఎంతమౌనమో
ఎవరేమి అన్నా ఎదురీదనా ఆ ఆ ఆ ఆ
సుడిగాలినైనా ఒడిచేరనా ఓ ఓ ఓ
నీడల్లే నీవెంటవుంటా నాప్రేమ సామ్రాజ్యమా


ప్రియతమ ప్రియతమ తరగని విరహమా కదలిరా ఆ కదలిరా

చరణం2:

పెదవుల్ని తడితే పుడుతుంది పేరే తియతీయగా
ఓ... కౌగిట్లో పడితే వాన కమ్మకమ్మగా
వెన్నెల్ల మంచం వేసేయనా ఆ ఓ ఓ ఓ
ఏకాంతసేవ చేసేయనా ఓ ఓ ఓ
వెచ్చంగ చలికాచుకోవాల నీగుండె లోగిళ్ళలో


ప్రియతమ ప్రియతమ తరగని పరువమా తరలిరా ఓ తరలిరా
కన్నెగోదారిలా కొంటె కావేరిలా నిండుకౌగిళ్ళలో చేరరావే
ప్రియతమ ప్రియతమ తరగని విరహమా కదలిరా ఆ కదలిరా

||

2 comments:

హృదయ బృందావని said...

Vihaari garu ! oka chinna help. hope u don't mind.
ee Song ye movie lodo cheppagalaraa...
"ennO ennO cheppAlanukunnA..telusaa
alalai egisE priya bhavalu telipedelaa..."

హృదయ బృందావని said...

thank you very much Vihaari garu :)