Oct 12, 2007

రాజమకుటం

తారాగణం:రామారావు,రాజసులోచన,కన్నాంబ
గాత్రం:పి.లీల
సంగీతం:మాష్టర్ వేణు
దర్శకత్వం:బి.ఎన్.రెడ్డి
సంస్థ:వాహిని
విడుదల:1960




పల్లవి:


సడిచేయకో గాలి సడిచేయబోకె
సడిచేయకో గాలి సడిచేయబోకె
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడిచేయకే

చరణం1:

రత్న పీఠిక లేని రారాజు నా స్వామి
మణి కిరీటం లేని మహరాజు గాకేమి
చిలిపి పరుగున మాని కొలిచి పోరాదే
సడిచేయకే

చరణం2:

ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకేలే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే
సడిచేయకే

చరణం3:

పండు వెన్నెలలడిగి పానుపు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవను పూని విసిరి పోరాదే

సడిచేయకో గాలి సడిచేయబోకె
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడిచేయకో గాలి

||

No comments: