గాత్రం:బాలు
పల్లవి:
ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే ఉదయినిగా
నాలో జ్వలించే వర్ణాల రచన
నాలో జనించే స్వరాలా
ఆవేశమంతా ఆలాపనేలే
చరణం1:
నిస నిస పసగమపనీస నిస నీస పసగమమ
సాసపామ మామదాద మదనిప మదనిప మదనిప
సాసమామ మామదాద సనిప సనిప సనిపదగస
అలపైటలేసే సెలపాట విన్నా
గిరివీణమీటే జలపాతమన్నా
నాలోన సాగే ఆలాపన
రాగాలు తీసే ఆలోచన
జర్దరతల నాట్యం
అరవిరుల మరుల కావ్యం
ఎగసి ఎగసి నాలో
గలమధువులడిగె కాలం
నిదురలేచె నాలో హృదయమే
ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే
చరణం2:
సానీస పనీస నీసగమగనీ
సాసానిద దనిప గమప గమప గమప గమగస గమగమ నిసనిస గమగపదనిస
వనకన్యలాడె తొలిమాసమన్నా
గోధూళితెరలో మలిసంధ్యకన్నా
అందాలు కరిగే ఆవేదన
నాదాల గుడిలో ఆరాధన
చిలిపి చినుకు చందం
పురి విడిన నెమలిపించం
ఎదను కదిపి నాలో
విరిపొదలు వెతికె మోహం
బదులులేని ఏదో పిలుపులా
ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో
నాలో జ్వలించే వర్ణాల రచన
నాలో జనించే స్వరాలా
ఆవేశమంతా ఆలాపనేలే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment