సాహిత్యం:వేటూరి
గాత్రం:బాలు,జానకి
సంగీతం:ఇళయరాజా
సంస్థ:క్రియేటివ్ కమర్షియల్స్
దర్శకత్వం:కోదండరామిరెడ్డి
విడుదల:1986
పల్లవి:
మళ్ళి మళ్ళి ఇది రానిరోజు మల్లెజాజి అల్లుకున్నరోజు
జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది
ఎదో అడగాలని ఎంతో చెప్పాలని
రగిలే ఆరాటంతో వెళ్ళలేను ఉండలేను ఏమికాను
మళ్ళి మళ్ళి ఇది రానిరోజు మల్లెజాజి అల్లుకున్నరోజు
చరణం1:
చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం
దూరమైన ప్రేమధ్యానాలే పాడలేని భావగీతం
ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో ఒక్కరం ఇద్దరం అవుతున్నాం
వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది
గున్నమామి విరబూస్తున్నా తోటమాలి జాడేది
నా ఎదే తుమ్మెదై సన్నిధే చేరగా
మళ్ళి మళ్ళి ఇది రానిరోజు మల్లెజాజి అల్లుకున్నరోజు
చరణం2:
కళ్ళనిండా నీలిస్వప్నాలే మోయలేని వింతమోహం
దేహమున్నా లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం
సందిట్లో ఈ మొగ్గే పూయని రాగాలే బుగ్గల్లో దాయని
గులాబీలు పూయిస్తున్నా తేనెటీగ అతిధేది
సందెమబ్బులెన్నొస్తున్నా స్వాతిచినుకు తడుపేది
రేవులో నావలా నీ జతే కోరగా
జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు వెన్నెలేది
ఎదో అడగాలని ఎంతో చెప్పాలని
రగిలే ఆరాటంతో వెళ్ళలేను ఉండలేను ఏమికాను
మళ్ళి మళ్ళి ఇది రానిరోజు మల్లెజాజి అల్లుకున్నరోజు
లాలలాల లాలలాలాల ఉహు ఉహు అహ అహ
|
No comments:
Post a Comment