తారాగణం:గిరిజ,సంజయ్ మిత్ర
దర్శకత్వం : రఘునాధ రెడ్డి
సంగీతం : వైద్యనాథన్ .ఎల్
నిర్మాత: రామనాథ్
విడుదల : 2002
పల్లవి:
మానసవీణ మౌనస్వరాన జుమ్మని పాడే తొలిభూపాళం

పచ్చదనాల పానుపుపైన అమ్మైనేలా జోకొడుతుంటే

చరణం1:
పున్నమినదిలో విహరించాలి పువ్వులఒళ్ళో పులకించాలి
పావురమల్లే పైకెగరాలి తొలకరి జల్లై దిగిరావాలి
తారల పొదరింట రాతిరిమజిలి వేకువ వెనువెంట నేలకు తరలి
కొత్త స్వేచ్చకందించాలి నా హృదయాంజలి
మానసవీణ మౌనస్వరాన జుమ్మని పాడే తొలిభూపాళం
వాగులా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగె పంతమే ఎపుడు నా సొంతం

చరణం2:
ఊహకె నీవె ఊపిరిపోసి చూపవె దారి ఓ చిరుగాలి
కలలకుసైతం సంకెలవేసె కలిమిఎడారి దాటించాలి
తుంటరి తూనీగనై తిరగాలి దోసెడు ఊసులు తీసుకువెళ్ళి
పేదగరిక పూలకు ఇస్తా నా హృదయాంజలి
మానసవీణ మౌనస్వరాన జుమ్మని పాడే తొలిభూపాళం
మానసవీణ మౌనస్వరాన జుమ్మని పాడే తొలిభూపాళం
పచ్చదనాల పానుపుపైన అమ్మైనేలా జోకొడుతుంటే
పచ్చదనాల పానుపుపైన అమ్మైనేలా జోకొడుతుంటే
మానసవీణ మౌనస్వరాన జుమ్మని పాడే తొలిభూపాళం
వాగులా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగె పంతమే ఎపుడు నా సొంతం
వాగులా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగె పంతమే ఎపుడు నా సొంతం
వాగులా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగె పంతమే ఎపుడు నా సొంతం
వాగులా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగె పంతమే ఎపుడు నా సొంతం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ హ హ ఆ ఆ హ ఆ ఆ ఆ
--------------------------------------------------
పాట ఇక్కడ వినండి.
------------------------------------------------
No comments:
Post a Comment