Oct 14, 2007

అంకుశం

తారాగణం:రాజశేఖర్,జీవిత,రామి రెడ్డి
సంగీతం:సత్యం
దర్శకత్వం:కోడి రామక్రిష్ణ
నిర్మాత:ఎం.శ్యాంప్రసాద్ రెడ్డి
సంస్థ:ఎం.ఎస్.ఆర్ట్స్
విడుదల:1990

పల్లవి:

ఆ ఆ ఆ ఆ అ అ అ ఆ ఆ ఆ
ఇది తరగని ప్రేమకు శ్రీకారం ఆ ఆ ఆ ఆ
ఇది మమతల మేడకు ప్రాకారం ఓ ఓ ఓ ఓ
పండిన కలలకు శ్రీరస్తు పసుపుకుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు
కలకాలం వైభోగమస్తు
ఇది తరగని ప్రేమకు శ్రీకారం ఆ ఆ ఆ ఆ
ఇది మమతల మేడకు ప్రాకారం ఓ ఓ ఓ ఓ
పండిన కలలకు శ్రీరస్తు పసుపుకుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు
కలకాలం వైభోగమస్తు

చరణం1:

కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసు
రసరమ్య బంధాలు రాతిరికి తెలుసు
పారాణి మిసమిసలు పదములకు తెలుసు
పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసు
చిగురుటాశల చిలిపి చేష్టలు
పసిడి బుగ్గల పలకిరింపులు
పడుచు జంటకే తెలుసు

ఇది తరగని ప్రేమకు శ్రీకారం ఆ ఆ ఆ ఆ
ఇది మమతల మేడకు ప్రాకారం ఓ ఓ ఓ ఓ
పండిన కలలకు శ్రీరస్తు పసుపుకుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు
కలకాలం వైభోగమస్తు

చరణం2:

ముగ్గుల తొలిపొద్దు ముంగిళ్ళకందం
శ్రీవారి చిరునవ్వే శ్రీమతికి అందం
నింటికి పున్నమి జాబిలి అందం
ఇంటికి తొలిచూలు ఇల్లలు అందం
జన్మజన్మల పుణ్యఫలముగా
జాలువారు పసిపాప నవ్వులే ఆలుమగలకు అందం

ఇది తరగని ప్రేమకు శ్రీకారం ఆ ఆ ఆ ఆ
ఇది మమతల మేడకు ప్రాకారం ఓ ఓ ఓ ఓ
పండిన కలలకు శ్రీరస్తు పసుపుకుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు
కలకాలం వైభోగమస్తు

||

1 comment:

తెలుగుకళ said...

Great effort.
Thanku very much for giving us a great opportunity to enjoy.