గాత్రం: ఏ.ఎం.రాజా
సాహిత్యం:దేవులపల్లి కృష్ణశాస్త్రి
నీ సిగ్గే సింగారమే నీ సొగసే బంగారమే
నీ సిగ్గే సింగారమే ఓ చెలియా నీ సొగసే బంగారమే
కనులారా గని మెచ్చేనే ఓ వనలక్ష్మి
మనసిచ్చి దిగివచ్చెనే ఉహు హు ఉహు హు
చరణం1:
ఓ ఓ ఓ నీ నవ్వు పూలు అవే మాకు చాలు
నీ వయ్యారాలు అవే వేనవేలు
ఓ పేదరాలా మరే పూజలేల
మా పైన నీ దయచూపవా ఓ నా చెలి
నీ సిగ్గే సింగారమే ఓ చెలియా నీ సొగసే బంగారమే
నీ సిగ్గే సింగారమే
చరణం2:
ఓ ఓ ఓ ఓ మా తోట పూచె వసంతమ్ము నీవే
మా బాట చూపే ప్రభాతమ్ము నీవే
మాలోన కొలువైన మహలక్ష్మి నీవే
మా పైన నీ దయచూపవా ఓ నా చెలి
నీ సిగ్గే సింగారమే ఓ చెలియా నీ సొగసే బంగారమే
కనులారా గని మెచ్చేనే ఓ వనలక్ష్మి
మనసిచ్చి దిగివచ్చెనే ఉహు హు ఉహు హు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment