Oct 2, 2007

ఆలాపన

తారాగణం:మోహన్,భానుప్రియ
గాత్రం:బాలు,జానకి
సంగీతం:ఇళయరాజా
దర్శకత్వం:వంశి
విడుదల:1992

పల్లవి:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ అ అ ఆ ఆ ఆ ఆ అ అ అ అ
ఆ.. కనులలో కలల నాచెలి ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా

చరణం1:

నిదురించువేళ
దసనిస దసనిస దనిదనిమ
హృదయాంచలాన
ఆ ఆ ఆ ఆ
అలగా పొంగెను నీ భంగిమ
దదసనిస
అది రూపొందిన స్వరమధురిమ
ఆ రాచనడక రాయంచకెరుక
ఆ రాచనడక రాయంచకెరుక
ప్రతి అడుగు శృతిమయమై కణకణమున రసధునులను మీటిన

ఆ.. కనులలో కలల నాచెలి ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా
ఆ.. కనులలో కలల నాచెలి ఆలాపనకు ఆది మంత్రమై

చరణం2:

నీ రాకతోనే
ఆ ఆ ఆ అ అ
ఈ లోయలోనె
దసనిస దసనిస దనిదనిమ
అణువులు మెరిసెను మణిరాశులై
మబ్బులు తేలెను పలు వన్నెలై
ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని
ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని
ఆకృతులై సంగతులై అణువణువున పులకలు ఒలికించిన

||

No comments: