గాత్రం:ఘంటసాల,సుశీల
సంగీతం:ఎస్.పి.కోదండపాణి
పల్లవి:
తొలి వలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే
తొలి వలపే పదే పదే పిలిచే మదిలో మల్లెలు విరిసే
తొలి వలపే ఏ ఏ
ఆ ఆ ఆ ఆ
చరణం1:
ఏమో ఇది ఎమో నీ పేదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు
ఆ అందం అనుబంధం నా మనసున మీకై దాచిన పూసిన కానుకలు

నీ కనుల వెలిగనే దీపాలు
అవి మీ ప్రేమకు ప్రతి రూపాలు
నీ కనుల వెలిగనే దీపాలు
అవి మీ ప్రేమకు ప్రతి రూపాలు
మన అనురాగానికి హారతులు
తొలి వలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే
తొలి వలపే ఏ
దరినిరిగ ఆ
మదరిగమా ఆ
గమ నీద నీద మ ఆ
చరణం2:
ఏల ఈ వేళ కడు వింతగ దోచే తీయగ హాయిగ ఈ జగము
యవ్వనము అనుభవము జత గూడిన వేళ కలిగిన వలపుల పరవశము

ఈ రేయి పలికనే స్వాగతము
ఈనాడే బ్రతుకున శుభదినము
ఈ రేయి పలికనే స్వాగతము
ఈనాడే బ్రతుకున శుభదినము
ఈ తనువే మనకిక చెరిసగము
తొలి వలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే
తొలి వలపే పదే పదే పిలిచే మదిలో మల్లెలు విరిసే
తొలి వలపే ఏ ఏ
No comments:
Post a Comment