తారాగణం:కృష్ణ,రామారావు,శోభన్ బాబు
గాత్రం:ఘంటసాల
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం:సి.నారాయణ రెడ్డి
దర్శకత్వం:కె ఎస్.ప్రకాష్ రావు
విడుదల: 1969
పల్లవి:
ఆడవే ఆడవే
ఆడవే జలకమ్ములాడవే
ఆడవే జలకమ్ములాడవే
కలహంస లాగ జలకన్య లాగ
కలహంస లాగ జలకన్య లాగ
ఆడవే ఆడవే
చరణం1:
ఆది కవి నన్నయ అవతరించిన నేల ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తెలుగు భారతి అందియలు పల్కె ఈ నేల
ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై జీవకళలొల్కు
గోదావరి తరంగాల ఆడవే ఆడవే
చరణం2:
నాగార్జునుని బోధనలు ఫలించినచోట ఆ ఆ ఆ ఆ ఆ ఆ
బౌద్దమత వృక్షమ్ము పల్లవించిన చోట
బుద్ధం శరణం గఛ్ఛామి
ధర్మం శరణం గఛ్ఛామి
సంఘం శరణం గఛ్ఛామి
కృష్ణ వేణి తరంగిణి జాలి గుండెయై
సాగరంబై రూపు సవరించుకొను నీట
ఆడవే ఆడవే
చరణం3:
కత్తులును ఘంటములు కదను దొక్కినవిచట
కత్తులును ఘంటములు కదను దొక్కినవిచట
అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట
నాటి రాయల పేరు నేటికిని తలపోయు
తుంగభద్రా నదీ తోయ మాలికలందు
ఆడవే ఆడవే
ఆడవే జలకమ్ములాడవే
ఆడవే జలకమ్ములాడవే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పాట ఇక్కడ వినండి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment