Nov 27, 2007

శ్రీకృష్ణార్జునయుద్ధం

గాత్రం:ఘంటసాల,పి.సుశీల


పల్లవి:

అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
మనసున మంగళవాద్యమాహా మోగెనులే

చరణం1:

నావలెనే బావకుడా నాకై తపములు చేయునులే
తపము ఫలించి నను వరియించి
తరుణములోనె విరాళ నన్ను చేరునులే
అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
మనసున మంగళవాద్యమాహా మ్రోగెనులే

అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
మనసున మంగళవాద్యమాహా మోగెనులే

చరణం2:

కుడికన్ను అదిరే కుడిభుజమదిరే
కోరిన చెలి నను తలచనులే
చిరకాలముగా కాంచిన కలలు
నిజమౌ తరుణము వచ్చెనులే

అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
మనసున మంగళవాద్యమాహా మోగెనులే

చరణం3:

మల్లెతోరణముల మంటపమందె కనులు మనసులు కలియునులే
కలసిన మనసుల కళరవళములతో జీవితమంతా వసంతగానమౌనులే
అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
మనసున మంగళవాద్యమాహా మోగెనులే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: