Nov 5, 2007
సాగర సంగమం
పల్లవి:
మౌనమేలనోయి
మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి
మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెల వెలిగే కన్నులా
ఎదలో వెన్నెల వెలిగే కన్నులా
తారాడే హాయిలా
ఇక మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి
చరణం1:
పలికే పెదవి వొణికింది ఎందుకో
వొణికే పెదవి వెనకాల ఏమిటో
కలిసే మనసులా విరిసే వయసులా
కలిసే మనసులా విరిసే వయసులా
నీలి నీలి ఊసులు లేతగాలి బాసలు
ఏమేమో అడిగినా
మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి
చరణం2:
హిమమే కురిసే చందమామ కౌగిట
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట
ఇవి ఏడడుగులా వలపు మడుగులా
ఇవి ఏడడుగులా వలపు మడుగులా
కన్నె ఈడు ఉలుకులు కంటిపాప కబురులు
ఎంతెంతో తెలిసిన
మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి
ఇంక మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెల వెలిగే కన్నులా
ఎదలో వెన్నెల వెలిగే కన్నులా
తారాడే హాయిలా
ఇక మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment