Dec 1, 2007

బ్రతుకుతెరువు

తారాగణం:నాగేశ్వరరావు,సావిత్రి,శ్రీరంజని
గాత్రం:పి.లీల
సంగీతం:ఘంటసాల
సాహిత్యం: సముద్రాల
దర్శకత్వం:రామకృష్ణారావు
విడుదల: 1953



పల్లవి:

లాలలా లాలాలల లలల
అందమే ఆనందం అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం

చరణం1:

పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమపరాగం
పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమపరాగం
ఓడిలో చెలి తీయనిరాగం ఓడిలో చెలి తీయనిరాగం
జీవితమే మధురానురాగం
జీవితమే మధురానురాగం

అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం

చరణం2:

చల్లని సాగరతీరం మది జిల్లను మలయసమీరం
చల్లని సాగరతీరం మది జిల్లను మలయసమీరం
మదిలో కదిలే సరాగం,మదిలో కదిలే సరాగం
జీవితమే అనురాగయోగం ,జీవితమే అనురాగయోగం

అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం
లాలలా లాలాలల లలల

||

No comments: