Dec 29, 2007

రక్తసంబంధం(1962)

తారాగణం:రామారావు,కాంతారావు,సావిత్రి,దేవిక
గాత్రం:ఘంటసాల,సుశీల
సంగీతం:ఘంటసాల
నిర్మాతలు:డూండి,సుందర్‌లాల్ నహతా
దర్శకత్వం:వి.మధుసూధనరావు
సంస్థ:రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్

పల్లవి:

చందురినిమించు అందమొలికించు ముద్దు పాపాయివే
నిన్ను కన్నవారింట కష్టములనీడ కరిగిపోయేనులే
కరుణతో చూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే

చందురినిమించు అందమొలికించు ముద్దు పాపాయివే
నిన్ను కన్నవారింట కష్టములనీడ కరిగిపోయేనులే
కరుణతో చూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే

చరణం1:

అన్న ఒడిచేర్చి ఆటలాడించు నాటి కధ పాడనా
నాటి కధ పాడనా
కలతలకు లొంగి కష్టముల కృంగు నేటి కధ పాడనా
కన్నీటి కధ పాడనా
కలతలకు లొంగి కష్టముల కృంగు కన్నీటి కధ పాడనా

కంటిలోపాప ఇంటికే జ్యోతి చెల్లి నాప్రాణమే
చెల్లి నాప్రాణమే
మము విధియె విడదీసె వెతలలో ద్రోసె మిగిలెనీ శోకమే
మిగిలెనీ శోకమే
మము విధియె విడదీసె వెతలలో ద్రోసె మిగిలెనీ శోకమే
చందురినిమించు అందమొలికించు ముద్దు పాపాయివే
నిన్ను కన్నవారింట కష్టములనీడ కరిగిపోయేనులే

చరణం2:

మనసులను కలుపు మధురబంధాలు మాసిపోరాదులే
పెరిగి నీవైనా మామగారింటి మనువునే కోరుమా
బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా

కాలమెదురైనా గతులు వేరైనా మమతలే మాయునా
పెరిగి నీవైనా అత్తగారింట కోడలిగ చేరుమా
బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా

దివిలో తాతలు భువిలో మానవులు ధూళిలో కలిసినా
అన్నచెల్లెల్ల జన్మబంధాలే నిత్యమై నిల్చులే
లాలి పాపాయి హాయి పాపాయి లాలి పాపాయి జోజో
లాలి పాపాయి జోజో
--------------------------------------------------------------

పాట ఇక్కడ వినండి.

-------------------------------------------------------------

No comments: