Dec 13, 2007

ప్రేమ(1989)

తారాగణం:వెంకటేష్,రేవతి,మంజుల
గాత్రం:బాలు
సంగీతం:ఇళయరాజా
నిర్మాత:డి.రామానాయుడు
దర్శకత్వం:సురేష్ కృష్ణ
సంస్థ:సురేష్ ప్రొడక్షన్స్



పల్లవి:

ప్రియతమా నా హృదయమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతి రూపమా ఆ ఆ
ప్రేమకే ప్రతి రూపమా
నా గుండెలో నిండినా గానమా
నను మనిషిగా చేసిన త్యాగమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతి రూపమా

చరణం1:

శిలలాంటి నాకు జీవాన్ని పోసి
కలలాంటి బ్రతుకు కళతోటి నింపి
వలపన్న తీపి తొలి సారి చూపి
ఎదలోని సెగలు అడుగంట మాపి
నులివెచ్చనైన ఓదార్పు నీవై
శృతి లయ లాగా జత చేరినావు
నువులేని నన్ను ఊహించలేను నా వేదనంతా నివేదించలేను
అమరం అఖిలం మన ప్రేమ
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతి రూపమా

చరణం2:

లా ల ల లా ల ల ల లా ల ల ల ల లా ల లా లా ల లా ల లా ల లా ల ల ల ల లల
నీ పెదవి పైన వెలుగారనీకు
నీ కనులలోన తడి చేరనీకు
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు
అది వెల్లువల్లే నను ముంచనీకు
ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్నా
మహా సాగరాలే నిను మింగుతున్నా
ఈ జన్మ లోన ఎడబాటులేదు
పది జన్మలైనా ముడేవీడిపోదు
అమరం అఖిలం మన ప్రేమా

ప్రియతమా నా హృదయమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతి రూపమా
ప్రేమకే ప్రతి రూపమా
నా గుండెలో నిండినా గానమా
నను మనిషిగా చేసిన త్యాగమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతి రూపమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతి రూపమా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: