గాత్రం: చిత్ర
సంగీతం: ఇళయరాజా
నిర్మాత: కె ఎస్.రామారావు
దర్శకత్వం: రావిరాజా పినిశెట్టి
పల్లవి:
ఓ ప్రేమా నా ప్రేమా
దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం
ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే చావేనా
దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం
రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబంధం
ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా
చరణం1:
క్షణమొక యుగముగా గడిపిన బ్రతుకిది తెలుసుకో ప్రియతమా
చిరమని సుఖమని కలయిక కలయని తలచుటే మధురమా
మృతులకు చితులకు ముగియని కధలివి కదలిరా ప్రణయమా
అడుగులు చిలికిన రుధిరవు మడుగుల ఎరుపులే ప్రళయమా
జారిపోయే కాలం చేజారిపోయే యోగం
రగులుతున్న గాయం నేనడగలేను న్యాయం
కరువౌతాను కన్నుల్లో గురుతుంటాను గుండెల్లో
ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే చావేనా
దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం
రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబంధం
ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా
చరణం2:
గిరిలను విడిచిన నదులిక వెనకకు తిరుగునా జగమున
కులమని కడుదని కులమని విలువలు చెరుగునా మనసున
గగనము మెరుపుల నగలను తొడిగితే ఘనతలే పెరుగున
ఉరుములు వినపడి ఉదయపు వెలుగులు ఆదురునా చెదురునా
పేదవాళ్ళ ప్రేమా కాటువేసే పామా
స్వాగతాలు అనగా చావుకైన ప్రేమ
మానై నేను బ్రతికున్న మనిషై నేను చస్తున్న
ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా
|
No comments:
Post a Comment