గాత్రం:ఘంటసాల
పల్లవి:
ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కని పాపను ఇక్కడుంచారు
ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కని పాపను ఇక్కడుంచారు
ఎక్కడున్నాగాని దిక్కువారేగద
చిక్కులను విడదీసి దరిచేర్చలేడా
ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కని పాపను ఇక్కడుంచారు
చరణం1:
ఆలి ఎడబాటెపుడు అనుభవించెడువాడు
అలిమేలుమంగ పతి అవనిలో ఒకడే
ఏడుకొండలవాడు ఎల్లవేళలయందు దోగాడు బాలునికి తోడునీడౌతాడు
ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కని పాపను ఇక్కడుంచారు
చరణం2:
నెల్లూరి సీమలో చల్లంగ శయనించు
శ్రీరంగనాయక ఆనందదాయక
తండ్రి మనసుకు శాంతి తనయునికి శరణు
దయసేయుమా క్షణము ఎడబాటు చేయక
ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కని పాపను ఇక్కడుంచారు
చరణం3:
ఎల్లలోకాలకు తల్లివై నీవుండ
పిల్లవానికి ఇంక తల్లిప్రేమా కొరత
బరువాయె బ్రతుకు చెరువాయె కన్నీరు
బరువాయె బ్రతుకు చెరువాయె కన్నీరు
కరుణించి కాపాడు మా కనకదుర్గ
ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కని పాపను ఇక్కడుంచారు
చరణం4:
గోపన్నవలే ఒగచు ఆపన్నులనుగాచి
భాదలను తీర్చేటి భధ్రాద్రివాశ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
భాదలను తీర్చేటి భధ్రాద్రివాశ
నిన్ను నమ్మిన కోర్కె నెరవేరునయ్య
చిన్నారి బాలునకి శ్రీరామరక్ష
ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కని పాపను ఇక్కడుంచారు
చరణం5:
బాలప్రహ్లాదుని లాలించి బ్రోచిన నారసింహునికన్న వేరు దైవములేడు
అంతు తెలియగరాని ఆవేదనలు కలిగె
అంతు తెలియగరాని ఆవేదనలు గలిగె
చింతలను తొలగించు సింహాచలేశా
ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కని పాపను ఇక్కడుంచారు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment