తారాగణం:కృష్ణ,జమున,అంజలీదేవి
గానం :ఎస్.పి.బాలు,పి.సుశీల
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం: కె.వి.మహదేవన్
దర్శకత్వం:కె.విశ్వనాథ్
సంస్థ:బాబు మూవీస్
విడుదల:1968
పల్లవి:
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
కొలువై ఉందువుగాని కలుముల రాణి
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా రావమ్మా
చరణం1:
గురివింద పొదకింద గొరవంక పలికె
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికె
గురివింద పొదకింద గొరవంక పలికె
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికె
తెల్లారి పోయింది పల్లె లేచింది
తెల్లారి పోయింది పల్లె లేచింది
పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
కొలువై ఉందువుగాని కలుముల రాణి
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా రావమ్మా
చరణం2:
కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు
కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు
ముత్యాల ముగ్గుల్లో ,ముగ్గుల్లో గొబ్బిళ్ళు
ముత్యాల ముగ్గుల్లో ,ముగ్గుల్లో గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో ,ముగ్గుల్లో గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో ,ముగ్గుల్లో గొబ్బిళ్ళు
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా రావమ్మా కృష్ణార్పణం
చరణం3:
పాడిచ్చే గోవులకు పసుపు కుంకం
పనిచేసే బసవనికీ పత్రీ పుష్పం
పాడిచ్చే గోవులకు పసుపు కుంకం
పనిచేసే బసవనికీ పత్రీ పుష్పం
గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం
గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం
కష్ఠించే కాపులకు కలకాలం సౌఖ్యం ,కలకాలం సౌఖ్యం
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
కొలువై ఉందువుగాని కలుముల రాణి
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా రావమ్మా కృష్ణార్పణం
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment