పల్లవి:
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే
ఎవరే ఎవరే పిలిచేదీ నే ఎట్టా ఎట్టా పలికేది

నక్కి నక్కి దాగేవారి పేరు చెప్పవే
ఎవరో ఎవరొ తెలియందే నే ఎట్టా ఎట్టా పిలిచేది

చరణం1:
కొంటే కోణంగి ఈడు కొట్టే కేరింత చూడు
ఏదో గమ్మత్తుగుంది మావ
లేనే లేదంటు హద్దు ముద్దుముద్దుకి పద్దు
రాస్తే ఎట్టా సత్యభామ
బంగారు గిన్నెలోని పరువాల పాయసాలు నీకే వుంచా నేను పోకిరి
చక్కంగ ముందుకొచ్చి సందేల విందులిస్తే కాదంటానా జత రామరి
వారం వర్జం చూడాలి ఆపైనే నీతో ఓడాలి
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
నక్కి నక్కి దాగేవారి పేరు చెప్పవే
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే
చరణం2:
ఇంటి తాళాలు దాచి గంట మోగించమంటే ఎట్టాగమ్మో గౌరమ్మో
జంటా బాణాలు దూసి ఇట్టా రెట్టిస్తే నన్ను వేగేదెట్టా మావయ్యో
గోరింక గూటిముందు చిలకమ్మ చిందులేసి ఆడిందంటే అర్ధమేమిటో
మందారపువ్వుమీద మురిపాల తుమ్మెదొచ్చి వాలిందంటే మరిదేనికో
నీలో నేనే దాగాలి చెలరేగే తాపం తీరాలి
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే
ఎవరే ఎవరే పిలిచేదీ నే ఎట్టా ఎట్టా పలికేది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
నక్కి నక్కి దాగేవారి పేరు చెప్పవే
ఎవరో ఎవరొ తెలియందే నే ఎట్టా ఎట్టా పిలిచేది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
నక్కి నక్కి దాగేవారి పేరు చెప్పవే
|
No comments:
Post a Comment