Mar 27, 2008
20వ శతాబ్దం
పల్లవి:
20వ శతాబ్దం ఇది 20వ శతాబ్దం
ధర్మదేవతకి ఉరికంబం ప్రపంచ శాంతికి పరాజయం
కలిపురుషుడికిది కిరీటం కిరాతకులకిది పతాకం
నమ్మకద్రోహానికి ఇది సిం హద్వారం
స్వార్ధపిశాచికి ఇది క్రీడారంగం
20వ శతాబ్దం ఇది 20వ శతాబ్దం
చరణం1:
చంద్రుని మీదకే పాదం మోపిన శతాబ్దం
నీతిని పాతాళానికి తొక్కిన శతాబ్దం
గుండలు మార్చి ఆయువు పెంచిన శతాబ్దం
గుప్పెడు మెతుకులు దొరకక చచ్చే శతాబ్దం
అగ్ర రాజ్యముల పోషణలో ఉగ్రవాదమే బలపడుతు
సమాజమంతా ఎడారి ఘోషల శ్మశనవాటిక అవుతుంటే
విజ్ఞానం,వివేకము వెలవెలబోయే శతాబ్దం
20వ శతాబ్దం ఇది 20వ శతాబ్దం
చరణం2:
బుద్ధుని భోదలు చాటింది ఒక శతాబ్దం
కరుణామయునే శిలువసిందొక శతాబ్దం
స్వర్ణయుగముగ వెలుగొందిందొక శతాబ్దం
నెత్తురు మడుగులు పొంగించిందొక శతాబ్దం
త్యాగపురుషులను బలిచేసి జన్మభూమినే అమ్మేసి
అమ్మయకులపై అధికారముకై అర్రులుచాచే కాలంలో మదనపడే మనిషికధే ఈ 20వ శతాబ్దం
20వ శతాబ్దం ఇది 20వ శతాబ్దం
ధర్మదేవతకి ఉరికంబం ప్రపంచ శాంతికి పరాజయం
కలిపురుషుడికిది కిరీటం కిరాతకులకిది పతాకం
నమ్మకద్రోహానికి ఇది సిం హద్వారం
స్వార్ధపిశాచికి ఇది క్రీడారంగం
20వ శతాబ్దం ఇది 20వ శతాబ్దం
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment