Mar 13, 2008

దొంగరాముడు

గాత్రం:ఘంటసాల


పల్లవి :

చెరసాల పాలైనావా చెరసాల పాలైనావా
ఓ ఓ సంబరాల రాంబాబు చెరసాల పాలైనావా
అనుకున్నది నీవొకటి అయినది మరి వేరొకటి
అనుకున్నది నీవొకటి అయినది మరి వేరొకటి
ముందుచూపు లేదాయే మాయని అపవాదాయే
చెరసాల పాలైనావా

చరణం1:

పరువే తన పెన్నిధిగా బ్రతికే నీ సోదరిని
పరువే తన పెన్నిధిగా బ్రతికే నీ సోదరిని
పూలమ్మిన చోటనే కట్టెలమ్మగాచేసి
పూలమ్మిన చోటనే కట్టెలమ్మగాచేసి
నిలువ నీడ కూల్దీసి నడి వీధుల పాల్జేసి
చెరసాల పాలైనావా
ఓ ఓ సంబరాల రాంబాబు చెరసాల పాలైనావా

చరణం2:

నిన్నుగని మెచ్చుకొని నీకే మనసిచ్చుకొని
నిన్నుగని మెచ్చుకొని నీకే మనసిచ్చుకొని
ఎన్నెన్నో కలలుగనే
ఎన్నెన్నో కలలుగనే చిన్నదాని జీవితము చీకటిగా చేసి
చెరసాల పాలైనావా
ఓ ఓ సంబరాల రాంబాబు చెరసాల పాలైనావా

చరణం3:

బలియిమ్మని యాచించిన భగ్గుమనే ఒక పలువ
పైసలాశ చూపించి ఓరచూచునొక చిలువ
పని చూపి పరువమాప పైటలాగునొక చెనతి
అండలేని ఆడదానికి ఆదరువే కరువా ఆదరువే కరువా

||

No comments: