Mar 14, 2008

భూకైలాస్


గాత్రం:ఘంటసాల
సాహిత్యం:సముద్రాల


పల్లవి:
తగునా వరమీయ ఈనీతి దూరునకు
పరమా పాపునకూ
తగునా వరమీయ ఈనీతి దూరునకు
పరమా పాపునకూ

చరణం1:

స్నేహముమీరగ నీవేడగా ద్రోహము నే చేసితీ
స్నేహముమీరగ నీవేడగా ద్రోహము నే చేసితీ
పాపకర్ము దుర్మదాంధు నన్ను
సేపక దయచూపెవేల
తగునా వరమీయ ఈనీతి దూరునకు
పరమా పాపునకూ

చరణం2:

మంగళదాయిని మాతపార్వతిని మతిమాలి మోహించితీ
మంగళదాయిని మాతపార్వతిని మతిమాలి మోహించితీ
కన్నులునిండే శూలాన పొడిచి కామముమాపుమా
కన్నులనిండే శూలాన పొడిచి కామముమాపుమా
తాళజాలను సలిపినఘనపాప సంతాప భరమేలిక
చాలును కడ తేర్చుము ఇకనైన నిదుపుణ్య హీన దుర్జన్మను
ఓనాటికి మతి వేరేగతి మరిలేదూ
ఈ నీచుని తల ఇందే తునకలు కాని
నీ నీఎడ వసి వాడి మాడి మసి మసి కాని
పాపము బాపుమా నీదయ చూపుమా నీదయ చూపుమా

చరణం2:

చేకొనుమా దేవా శిరము చేకొనుమా దేవా
శిరము చేకొనుమా దేవా
శిరము చేకొనుమా దేవా
చేకొనుమా దేవా శిరము చేకొను మహాదేవా
మాలికలో మణిగానిలుపూ
కంఠమాలికలో మణిగా నిలుపూ
నాపాప ఫలము తరుగు విరుగు
పాపఫలము తరుగూ విరుగూ
పాపఫలము తరుగూ విరుగూ
చేకొనుమా దేవా శిరము చేకొనుమా దేవా

--------------------------------------------------------

పాట ఇక్కడ వినండి

-------------------------------------------------------

No comments: