Mar 16, 2008

దొంగరాముడు

గాత్రం:సుశీల


పల్లవి :

అనురాగము విరిసేనా ఓ రేరాజా
అనుతాపము తీరేనా
వినువీధినేలే రాజువే నిరుపేద చెలిపై మనసౌనా
అనురాగము విరిసేనా ఓ రేరాజా
అనుతాపము తీరేనా

చరణం1:

నిలిచేవు మొయిలో మాటున పిలిచేవో కనుల గీటున
నిలిచేవు మొయిలో మాటున పిలిచేవో కనుల గీటున
పులకించు నాలో డెందము ఏనాటి ప్రెమభందమో
ఓ రేరాజా అనురాగము విరిసేనా

చరణం2:

కొనసాగే మోహాలేమో వెనుకాడే సందేహాలేమో
కొనసాగే మోహాలేమో వెనుకాడే సందేహాలేమో
నీ మనసేమో తేటగా వెనిగించవయ మహరాజా
ఓ రేరాజా అనురాగము విరిసేనా
వినువీధినేలే రాజువే నిరుపేద చెలిపై మనసౌనా
అనురాగము విరిసేనా

||

No comments: