పల్లవి :
అందచందాల సొగసరివాడు అందచందాల సొగసరివాడు
విందు భొంచేయ వస్తాడు నేడు చందమామ ఒహొ చందమామ
చందమామ ఒహొ చందమామ ఓ ఓ ఓ
చరణం1:
ఓ ఓ ఓ ఓ ఓ చూడచూడంగ మనసగువాడు
ఈడుజోడైన వలపుల రేడు
ఓ వాడు నీకన్న సోకైనవాడు
విందు భొంచేయ వస్తాడు నేడు చందమామ ఒహొ చందమామ
చందమామ ఒహొ చందమామ ఓ ఓ ఓ
చరణం2:
ఓ ఓ ఓ ఓ ఓ వాని కన్నుల్లో వెన్నెల్ల జాలు
వాని నవ్వుల్లో ముత్యాలు జారు
వాడు నీకన్న చల్లనివాడు
విందు భొంచేయ వస్తాడు నేడు చందమామ ఒహొ చందమామ
చందమామ ఒహొ చందమామ ఓ ఓ ఓ
చరణం3:
ఓ ఓ ఓ ఓ ఓ మేటి పోటిల గడుసరివాడు
మాట పాటించు మగసిరివాడు
ఓ వాడు నీకన్న సిరిగలవాడు
విందు భొంచేయ వస్తాడు నేడు చందమామ ఒహొ చందమామ
చందమామ ఒహొ చందమామ ఓ ఓ ఓ
అందచందాల అందచందాల సొగసరివాడు
విందు భొంచేయ వస్తాడు నేడు చందమామ ఒహొ చందమామ
చందమామ ఒహొ చందమామ ఓ ఓ ఓ
|
No comments:
Post a Comment