Mar 11, 2008

ప్రతిఘటన

తారాగణం:విజయశాంతి,చంద్రమోహన్,చరణ్ రాజ్
గాత్రం:జానకి
సంగీతం:కె.చక్రవర్తి
దర్శకత్వం:టి.కృష్ణ
నిర్మాత:రామోజిరావు
సంస్థ:ఉషాకిరణ్ మూవీస్
విడుదల:1986




పల్లవి:

ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వనీతలోకంలో
రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో
మరో మహాభారతం ఆరొవ వేదం
మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం

చరణం1:

పుడుతూనే పాలకేడ్చి,పుట్టి జంపాలకేడ్చి
పెరిగి పెద్దకాగానే ముద్దు మురిపాలకేడ్చి
తనువంతా దోచుకున్న తనయులు మీరు
మగసిరితో బ్రతకలేక కీచకులై
కుటిలకామమేశకులై స్రీజాతిని అవమానిస్తే
మీ అమ్మల స్తన్యంతో మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్నా ఈనాడే మీకోసం
మరో మహాభారతం ఆరొవ వేదం
మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం

చరణం2:

కన్న మహాపాపానికి ఆడది తల్లిగ మారి
నీ కండలు పెంచినదీ గుండెలతో కాదా
ఎర్రని తన రక్తాన్నే తెల్లని నెత్తురు చేసి
పెంచుకున్న తల్లి ఒక ఆడదనే మరిచారా
కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర
ఏనాడో మీరుంచిన లేత పెదవి ముద్ర
ప్రతి భారత సతి మానం చంద్రమతి మాంగల్యం
మర్మస్థానం కాదది నీ జన్మస్థానం
మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం
శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే
మానవ రూపంలోనే దానవులై పెరిగితే
సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే
కన్నులుండి చూడలేని దుతరాష్ట్రుల పాలనలో
భర్తలుండి విధవయైన ద్రౌపది ఆక్రందనలో
నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే
ఏమైపోతుంది సభ్యసమాజం ఏమైపోతుంది మానవధర్మం
ఏమైపోతుంది ఈ భారతదేశం మన భారతదేశం మన భారతదేశం

||

No comments: