పల్లవి:
అందెలు పిలిచిన అలికిడి లో అణువణువున అలజడులు
ఎద పదమొకటౌ లాహిరీలో
ఎద పదమొకటౌ లాహిరీలో ఎన్నడు ఎరగని ఉరవడులు
ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల

ఇది నా ప్రియ నర్తన వేళ ఆ ఆ ఆ
చరణం1:
ఉత్తరాన ఒక ఉరుము ఉరిమినా ఉలికి చిలిపి మెరుపొకటి మెరిసినా

ఒక కదలిక చిరు మెదలిక గిలిగింతగ జనియించగా

నాలుగు దిక్కుల నడుమ పుడమి నా వేదికగా నటన మాడనా

అనంత లయతో నిరంత గతితో జతులు పాడనా ఆడనా
ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల
ఇది నా ప్రియ నర్తన వేళ ఆ ఆ ఆ
చరణం2:
మేఘ వీణ చలి చినుకు చిలికిన మేను లోన చిరు అలలు కదలినా

ఒక లహరిక మధు మదనిక వలవంతగ జనియించగా
ఒక లహరిక మధు మదనిక వలవంతగ జనియించగా
సుగమ నిగమ సుధ ఎదల పొంగగా వరదలాగా ఉప్పొంగనా

వరాలి ఎదలొ స్వరాల రొదలో స్వరము పాడనా ఆడనా
ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల
ఇది నా ప్రియ నర్తన వేళ ఆ ఆ ఆ
|
No comments:
Post a Comment