Jun 3, 2008

ప్రేమలేఖలు

గాత్రం:జిక్కి

పల్లవి:

ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జెల సంగీతం
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జెల సంగీతం
మువ్వల చిందు హుషారు పసందు వినే చెలివిందు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జెల సంగీతం
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జెల సంగీతం

చరణం1:

ఓ ఓ ఓ చందురుని మోమందు బంధించివేసే...బంధించివేసే
ఓ ఓ ఓ తారకల కోరికల తలంబ్రాలు పోసె ...తలంబ్రాలు పోసె
తరుణి మితిమించెను వరుడు కసియించెను
ఒంపుల ఠివి,కింపుల మోవి,ఇంపగు బ్రోవి
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జెల సంగీతం
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జెల సంగీతం

చరణం2:

ఓ ఓ ఓ మనసు మనసు కలువంగ మనువు నిజమాయె... మనువు నిజమాయె
ఓ ఓ ఓ ఒడిదుడుకుల నిలబడితె వలపు రుజువాయె... వలపు రుజువాయె
ఇంతి గిలిగింతకే భూమి పులకించెనే
తెరలు తొలంగి, మరులు చెలంగి, కులుకులు పొంగి
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జెల సంగీతం
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జెల సంగీతం

చరణం3:

ఓ ఓ ఓ వగలే సిరి నగలైతే వలపంత పండె...వలపంత పండె
ఓ ఓ ఓ హాయి హాయిగుందోయి రేయంత నిండె... రేయంత నిండె
సాగెనూరేగింపు చేయి చేయి కలుపు
మసక చీకటిలో ,మల్లె పందిటిలో,పెళ్ళి సందిటిలో
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జెల సంగీతం
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జెల సంగీతం
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జెల సంగీతం
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జెల సంగీతం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

1 comment:

gaddeswarup said...

I think that the last line is "మసక చీకటిలో, మల్లె పందిటిలో, ప్రియునిసందిటిలో"