పల్లవి:
ఒక్కటే ఆశ అందుకో శ్వాస
అచ్చగా అంకితం చేసా పుచ్చుకో ప్రాణేశా
అచ్చగా అంకితం చేసా పుచ్చుకో ప్రాణేశా
చుక్కనే చూసా లెక్కలే వేసా
నింగిపై అంగలే వేసా కిందికే దించేసా
నింగిపై అంగలే వేసా కిందికే దించేసా
ఒక్కటే ఆశ అందుకో శ్వాస
చరణం1:
మెత్తగా ఒళ్ళో పెట్టుకో కాళ్ళు
వుందిగా అంకపీఠం ఆడ పుట్టుకే అందుకోసం
గట్టిగా పట్టుకో భక్తిగా అద్దుకో
పుచ్చుకో పాద తీర్ధం పాదపూజలే ఆది పాఠం
చాకిరీ చెయ్యనా బానిసై
నీ సేవలే చెయ్యనా పాదుషా
దీవెనే తీసుకో బాలికా
నీ జీవితం సార్ధకం పొమ్మిక
మొక్కులే తీరి అక్కునే చేరి దక్కెనే సౌభాగ్యం
చుక్కనే చూసా లెక్కలే వేసా
నింగిపై అంగలే వేసా కిందికే దించేసా
అచ్చగా అంకితం చేసా పుచ్చుకో ప్రాణేశా
ఒక్కటే ఆశ అందుకో శ్వాస
చరణం2:
నచ్చెనే నారి వచ్చెనే కోరీ
తెచ్చెనే ప్రేమ సౌఖ్యం
సాటి లేనిదీ ఇంతి సత్యం
మెచ్చెనే చేరి ముచ్చటే తీరి
ఇచ్చెనే ప్రేమ రాజ్యం
అంతులేనిదే సంతోషం
స్వప్నమే సత్యమై వచ్చెనేమో
వెచ్చగా సర్వము పంచగా
స్వర్గమే సొంతమై దక్కెనేమో
అచ్చటా ముచ్చటా తీర్చగా
మక్కువే మీరి ముద్దులే కోరి
అందెనా ఇంద్రభోగం
ఒక్కటే ఆశ అందుకో శ్వాస
అచ్చగా అంకితం చేసా పుచ్చుకో ప్రాణేశా
నింగిపై అంగలే వేసా కిందికే దించేసా
ఒక్కటే ఆశ అందుకో శ్వాస
|
No comments:
Post a Comment