Jun 9, 2008

విప్రనారాయణ

గాత్రం:రేలంగి


పల్లవి:

కొంపకు నిప్పంటుకుంటే పైకప్పే కాలిపోతుంది
హరిదాసులను ఆడది అంటుకుంటే బ్రతుకే కూలిపోతుంది
ఆడది అంటే లయం లయం ఆ నీడంటేనే భయం భయం
ఆడది అంటే లయం లయం ఆ నీడంటేనే భయం భయం
ఆ నీడంటేనే భయం భయం

చరణం1:

ముక్కు మూసుకొని యోగం పట్టే మునిరాయల్లకు ప్రళయం
ముక్కు మూసుకొని యోగం పట్టే మునిరాయల్లకు ప్రళయం
హరుడంతటి బల్ మగవాన్నే హరుడంతటి బల్ మగవాన్నే
ఆటాడించిందాడది ఓ ఆటాడించిందాడది
ఆడది అంటే లయం లయం ఆ నీడంటేనే భయం భయం
ఆ నీడంటేనే భయం భయం

చరణం2:

కల్లాకపటం రెండు కళ్ళు, కళ్ళు భ్రమించే ఒళ్ళు
కల్లాకపటం రెండు కళ్ళు, కళ్ళు భ్రమించే ఒళ్ళు
కాదయ్యో... కాదయ్యో పులిహోర పొంగలి గరళపు ముద్దే ఆడది
కాదయ్యో పులిహోర పొంగలి గరళపు ముద్దే హరిదాసులకు
ఆడది అంటే లయం లయం ఆ నీడంటేనే భయం భయం
ఆ నీడంటేనే భయం భయం

||

No comments: