Jun 10, 2008

ముద్దమందారం

గాత్రం: బాలు

పల్లవి:

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూలడోల నేనుకానా

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూలడోల నేనుకానా

చరణం1:

సూరీడు,నెలరేడు సిరిగల దొరలే కారులే
పూరిగుడిసల్లో పేదమనసుల్లో వెలిగేటి దీపాలులే
ఆ నింగి ఈ నేల కొనగల సిరులే లేవులే
కలిమిలేముల్లో కరిగే ప్రేమల్లొ నిరుపేద లోగిళ్ళులే

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూలడోల నేనుకానా

చరణం2:

ఈ గాలిలో తేలి వెతలను మరచే వేళలో
కలికి వెన్నెల్లో కలల కన్నుల్లో కలతారిపోవాలిలే
ఆ తారలో తేరి తళతళ మెరిసే రేయిలో
ఒడిలో నువ్వుంటే ఒదిగిపోతుంటే కడతేరిపోవాలిలే

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూలడోల నేనుకానా

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూలడోల నేనుకానా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: