గాత్రం:బాలు,జానకి
సంగీతం:మాధవపెద్ది రమేష్
దర్శకత్వం: సింగీతం శ్రీనివసరావు
నిర్మాత:బి.వెంకటరామిరెడ్డి
సంస్థ: చందమామ విజయ కంబైన్స్
విడుదల:1992
పల్లవి:
ఒహొ ఒహొ ఒహొ బుల్లిపావురమా
అయ్యో పాపం అంటే అది నేరమా
అతివలకింత పంతమా ఓ ఓ ఓ
అలకలు వారి సొంతమా
ఒహొ ఒహొ ఒహొ బుజ్జిపావురమా
పదే పదే పదే వెటకారమా
అతివలు అంత సులభమా ఓ ఓ ఓ
శృతి ఇక మించనీకుమా
చరణం1:
మాటే వినకుంటే బైటే పడుకుంటే
మంచే పడునంట మంచే చెబుతుంట
అమ్మో మగవారు అన్నిట తగువారు
హద్దే మరిచేరు చాలిక ఆ జోరు
కోపం తీరాలంట తాపం తగ్గాలంట
తాపం తగ్గాలంటే చొరవే మానాలంట
మాట మంతి మర్యాదే అపచారమా
ఒహొ ఒహొ ఒహొ బుజ్జిపావురమా
పదే పదే పదే వెటకారమా
ఒహొ ఒహొ ఒహొ బుల్లిపావురమా
అయ్యో పాపం అంటే అది నేరమా
చరణం2:
నెయ్యం తియ్యంగ చెయ్యగ రమ్మంట
వియ్యాల పందిట్లో కయ్యం తగదంట
ఇళ్ళే బెజ్జాలే చెల్లవు పొమ్మంట
అల్లరి చాలిస్తే ఎంతో మేలంట
వెండి వెన్నలంతా ఎండగ మారిందంట
కొంటె కుర్రాళ్ళకు అదియే సరియంట
తగని తెగని తగువంతా తన నైజమా
ఒహొ ఒహొ ఒహొ బుల్లిపావురమా
అయ్యో పాపం అంటే అది నేరమా
అతివలకింత పంతమా ఓ ఓ ఓ
అలకలు వారి సొంతమా
ఒహొ ఒహొ ఒహొ బుజ్జిపావురమా
పదే పదే పదే వెటకారమా
అతివలు అంత సులభమా ఓ ఓ ఓ
శృతి ఇక మించనీకుమా
ఒహొ ఒహొ ఒహొ బుల్లిపావురమా
ఒహొ ఒహొ ఒహొ బుజ్జిపావురమా
|
No comments:
Post a Comment