Feb 20, 2009

అభిలాష

గాత్రం:బాలు,జానకి



పల్లవి:

వేళాపాళ లేదు కుర్రాళ్ళాటకు
ఓడే మాట లేదు ఆడేవాళ్ళకు
ఏది గెలుపో హొయ్ హొయ్
ఏది మలుపో హొయ్ హొయ్
తెలుయువరకు ఇదే ఇదే ఆట మనకు
వేళాపాళ లేదు కుర్రాళ్ళాటకు
ఓడే మాట లేదు ఆడేవాళ్ళకు
తకదిమి తద్దోంత్త తకదిమి తద్దోంత్త తకదిమి తద్దోంత్త తరికిట తరికిట త

చరణం1:

మన్మధుడు నీకు మంత్రి అనుకోకు నీ వయసు కాచేందుకు హా హొ
వయసు ఒక చాకు అది వాడుకోకు నా మనసు కోసేందుకు
మనసే లేదు నీకు ఇచ్చేసావు నాకు
లేదని నీదని కలగని నిజమని అనుకొని ఆడకు
లాలాలలాల లాలాలల
తకదిమి తద్దోంత్త తకదిమి తద్దోంత్త తకదిమి తద్దోంత్త తరికిట తరికిట త

చరణం2:

కలకకొక రూపు కనులకొక కైపు తొలిమాపు విరి పానుపు
కవిత ఇక ఆపు కలుసుకో రేపు చెబుతాను తుది తీరుపు
అహ ఏ తీర్పు వద్దు ఇదిగో తీపి ముద్దు
వద్దని ముద్దని చిదుమని పెదవిని చిటికలు వేయకు

వేళాపాళ లేదు కుర్రాళ్ళాటకు
ఓడే మాట లేదు ఆడేవాళ్ళకు
ఏది గెలుపో హొయ్ హొయ్
ఏది మలుపో హొయ్ హొయ్
తెలుయువరకు ఇదే ఇదే ఆట మనకు
లాలాలలాల లాలాలల
తకదిమి తద్దోంత్త తకదిమి తద్దోంత్త తకదిమి తద్దోంత్త తరికిట తరికిట త

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: