పల్లవి:
పాలించరా రంగా పరిపాలించరా రంగా
కరుణాంతరంగ శ్రీరంగా
కరుణాంతరంగ శ్రీరంగా
పాలించరా రంగా
చరణం1:
మరువని తల్లివి,తండ్రివి నీవని
మరువని తల్లివి,తండ్రివి నీవని
నెరనమ్మితిరా రంగా
మొరవిని పాలించే దొరవని
మొరవిని పాలించే దొరవని
శరణంటినిరా శ్రీరంగా
పాలించరా రంగా
చరణం2:
మనసున నీ స్మృతి మాయకమునుపే
మనసున నీ స్మృతి మాయకమునుపే
కనులను పొరలు మూయక ముందే
కనరారా ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కనరారా నీ కమనీయాకృతి
కనియెద మనసారా రంగా కనియెద మనసారా
పాలించరా రంగా పరిపాలించరా రంగా
చరణం3:
తరులును,హరులును మణిమందిరమును
తరులును,హరులును మణిమందిరమును
సురభోగాలను కోరనురా
సురభోగాలను కోరనురా
దరి కనరాని భవసాగరమును దాటించుమురా గరుడతురంగా
పాలించరా రంగా పరిపాలించరా రంగా
కరుణాంతరంగ శ్రీరంగా పాలించరా రంగా
|
No comments:
Post a Comment