గాత్రం:బాలు,చిత్ర,కీరవాణి
పల్లవి:
సిరి సిరి పూల చెల్లాయి పాప సీమంతమేనాడే
పులకల కొమ్మ పుణ్యాల రెమ్మ పేరంటమేనాడే
ఆశగా మధుమాసమే అడిగింది ఈ మాట
ఊగక మన ఊయల అలిగింది ఈ పూట
చరణం1:
రేయందాలలో నెలవంక
ఈ నేల వంక దిగి వచ్చేనా
శృంగారాలకే సెలవింక
జోలాలిలకే నిదురించేనా
పెళ్ళినాటి కుంకిపాటు తల్లినాడు సాగునా
అమ్మచాటు బిడ్డగోడు అయ్యగారికీ పనా
కలలే కన్నారు కమ్మగా
ఇదిగో మీ కానుక
చిలిపే వలపే మొలకై మొలిచే కనుపాపలా కనిపించెలే
కలికి చిలక ఒడిని అలికి అనురాగమే తినిపించెలే
సిరి సిరి పూల చెల్లాయి పాప సీమంతమేనాడే
ఆశగా మధుమాసమే అడిగింది ఈ మాట
చరణం2:
మా సంసారమే మధుగీతం
పూసే యవ్వన వనజాతాలే
పిల్లా పాపల అనుబంధం
దాచేసిందిలే తొలిగ్రంధాలే
గోకులాన పుట్టినోడు కొంగుచాటు కృష్ణుడే
నందనాల అందమంత బాలకృష్ణుడొక్కడే
ఎదలో వున్నాడు జీవుడు ఎదురైతే దేవుడు
పలికే మురళి తలపై నెమలి అది పాటగా ఇది ఆటగా
ప్రజలో డజనై భజనే పడితే కథ కంచికే మనమింటికే
సిరి సిరి పూల చెల్లాయి పాప సీమంతమేనాడే
ఆశగా మధుమాసమే అడిగింది ఈ మాట
పులకల కొమ్మ పుణ్యాల రెమ్మ పేరంటమేనాడే
ఊగక మన ఊయల అలిగింది ఈ పూట
|
No comments:
Post a Comment